ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ IBM ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఒకే ఒక్క రోజులో.. ఐబీఎం షేర్లు 25 శాతం పడిపోయాయి. 58 ఏళ్లల్లో ఇలా జరగటం ఇదే. 1987లో ఒక సారి ఇలా జరిగింది. మళ్లీ ఇప్పుడే ఇలా జరగటం. ఒకే ఒక్క రోజులో IBM విలువ 100 మిలియన్స్ డాలర్లు తగ్గిపోయింది. దీనికి కారణం లేకపోలేదు.
2026 ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ విడుదల చేసింది కంపెనీ. కంపెనీ ఆదాయం కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగినట్లు ప్రకటించింది. సాఫ్ట్ వేర్ ఆదాయం 5 శాతం పెరిగినట్లు ప్రకటించినా.. అంచనాలకు ఇది చాలా తక్కువగా ఉండటంతో మార్కెట్ వర్గాలు షాక్ అయ్యాయి. అంచనాలను అందుకోలేకపోవటం.. ఆదాయం కేవలం ఒక్క శాతంగా ఉండటంతో కంపెనీ పరిస్థితులపై పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
IBM కంపెనీ మూడు నెలల రిజల్ట్స్ పై సీఈవో అరవింద్ కృష్ణ స్పందించారు. పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోయాం.. వేగంగా స్పందించలేకపోయాం.. మేం తడబడ్డాం అంటూ ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖ మరింత భయాందోళనలను వ్యక్తం చేసింది. మారుతున్న AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అనుగుణంగా కంపెనీ పురోగతి లేదని సీఈవో వెల్లడించటం కూడా స్టాక్ మార్కెట్లో నష్టాలకు కారణం అయ్యింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు టెక్ కంపెనీలు వేగంగా అడుగులు వేయటంతో ప్రపంచ వ్యాప్తంగా సర్వర్లు, మెమరీ చిప్స్, డేటా స్టోరేజీలకు డిమాండ్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగిందని.. దీని వల్ల ధరలు పెరగటం, ముడి సరుకు సరఫరా కొరత ఏర్పడటం వల్ల.. ఆశించిన స్థాయిలో కంపెనీ అమ్మకాలు పెరగలేదని స్పష్టం చేసింది కంపెనీ. మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టు కంపెనీ మూలధన వ్యయాల ఖర్చులో ప్రాధాన్యతను గుర్తించలేకపోవటం కూడా మరో కారణంగా పెట్టుబడిదారులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు సీఈవో అరవింద్ కృష్ణ.
అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న IBM.. ఈ క్వార్టర్ ఫలితాలను టెక్ కంపెనీలతోపాటు పెట్టుబడిదారులు ఊహించలేకపోవటంతో.. మార్కెట్ లో ఐబీఎం షేర్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి రోజున ఒక్కో షేరు 288 డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు 217 డాలర్లుగా ట్రేడ్ అవుతుంది. అంటే ఒక్క రోజులోనే 26 శాతం వరకు నష్టపోయింది.
మార్కెట్ లో రోజురోజుకు పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి తగ్గట్టు ఐబీఎం ఇప్పుడైనా అడుగులు వేస్తే నష్టాల నుంచి బయటపడొచ్చని.. కంపెనీ తన ఖర్చులను ఏఐ వైపు మళ్లిస్తే మళ్లీ పుంజుకుంటుంది అంటున్నారు మార్కెట్ వర్గాలు. 1911లో ఐబీఎం కంపెనీ ప్రారంభం అయ్యింది.
