హిందూ సాంప్రదాయంలో అమావాస్య తిథికి, ముఖ్యంగా పితృదేవతల (పూర్వీకుల) పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేద క్యాలెండర్ ప్రకారం, ఈరోజు (జూలై 14) అమావాస్యను జరుపుకుంటారు. పితృదేవతల ఆశీస్సులు పొందడానికి, వారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
శాస్త్రం ప్రకారం.. అమావాస్య రోజున లేదా ఆ సమయంలో కలలో పితృదేవతలు కనిపిస్తే దానికి కొన్ని ప్రత్యేక అర్థాలు, ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ మీకు అలా పూర్వీకులు కలలో కనిపిస్తే, శుభ ఫలితాలు పొందడానికి ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు చూద్దాం...
కలలో పూర్వీకులు కనిపిస్తే తప్పకుండా చేయాల్సిన పనులు:
1. సూర్య నమస్కారం & తర్పణం:
అమావాస్య రోజున మీ పూర్వీకులు కలలో కనిపిస్తే.. ఉదయాన్నే లేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. ముందుగా సూర్య భగవానుడికి అర్ఘ్యం (నీరు) ఇవ్వాలి. ఆ తర్వాత, పితృదేవతల దిశ అయిన దక్షిణ వైపునకు తిరిగి.. ఒక పాత్రలో నీళ్లు తీసుకుని, అందులో నల్ల నువ్వులు, కుశ గడ్డి (దర్భ) కలిపి పూర్వీకులకు తర్పణం వదలాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నమై, వారి ఆశీస్సులు కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు.
2. బ్రాహ్మణ భోజనం లేదా అన్నదానం:
అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం చాలా మంచిది. ఇలా ఎవరికైనా అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరుతుందని, మనకు మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
3. దక్షిణ దిశలో దీపం:
ఒకవేళ పూర్వీకులు కలలో వస్తే ఆ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అమావాస్య సాయంత్రం వేళ, పితృదేవతల స్థానమైన దక్షిణ దిశలో ఆవనూనెతో దీపం వెలిగించాలి లేదా దగ్గర్లోని రావి చెట్టు వద్ద నూనె దీపం వెలిగించి, ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇది పితృదోషాలను తొలగించి, జీవితంలో మంచి మార్పులను తెస్తుంది.
4. వస్తువులు, దుస్తుల దానం:
అమావాస్య రోజున చేసే దానాలకు ఎంతో పుణ్యఫలం ఉంటుంది. పూర్వీకులు కలలో కనిపిస్తే.. గుడికి వెళ్లి ఆహారధాన్యాలు, డబ్బు లేదా బట్టలు దానం చేయండి. అవసరమైన వారికి బూట్లు, చెప్పులు దానం చేయడం కూడా చాలా మంచిది.
కలలో పూర్వీకులు ఎలాంటి ఆకారంలో కనిపిస్తే ఏం జరుగుతుంది ?
నవ్వుతూ కనిపిస్తే (శుభ సంకేతం): మీ పూర్వీకులు కలలో నవ్వుతూ, సంతోషంగా కనిపిస్తే అది చాలా మంచిది. మీరు చేస్తున్న పనుల పట్ల, మీ కుటుంబం పట్ల వారు సంతృప్తిగా ఉన్నారని దానికి అర్థం.
ALSO READ : జులై 15 నుంచి ఆషాఢం ప్రారంభం..విశిష్టత..
ఆహారం అడుగుతున్నట్లు కనిపిస్తే: ఒకవేళ పూర్వీకులు కలలో వచ్చి మిమ్మల్ని ఏదైనా తినడానికి అడుగుతున్నట్లు అనిపిస్తే.. వారికి ఆకలిగా ఉందనడానికి అది సంకేతం. అలాంటి కల వచ్చినప్పుడు వెంటనే పితృదేవతల పేరుతో పిండదానం, తర్పణం ఇచ్చి, బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
