CBSE టెన్త్ సర్టిఫికెట్ కావాలంటే.. థర్డ్ లాంగ్వేజ్ తప్పనిసరిగా పాస్ కావాల్సిందే

CBSE టెన్త్ సర్టిఫికెట్ కావాలంటే.. థర్డ్ లాంగ్వేజ్ తప్పనిసరిగా పాస్ కావాల్సిందే

2026-27 ఎకడమిక్ ఇయర్ నుంచి  సీబీఎస్ఈ విద్యావిధానంలో కీలక మార్పులు చేసింది.  సీబీఎస్ఈ టెన్త్ విద్యార్థులు ఇకపై సర్టిఫికెట్ పొందాలంటే తప్పనిసరిగా థర్డ్ లాంగ్వేజ్  పాస్ కావాలి. ఇంతకు ముందు 9, 10 క్లాస్ లలో కనీసం రెండు లాంగ్వేజ్ పాస్ అయితే సరిపోయేది. ఇప్పుడు థర్డ్ లాంగ్వేజ్ కూడా తప్పనిసరి  చేశారు. ఒకవేళ విద్యార్థులు టెన్త్ పాస్ అయి థర్డ్ లాంగ్వేజ్ పాస్ కాకపోతే నెక్ట్స్ ఎకడిమిక్ ఇయర్ లోనైనా తప్పనిసరిగా పాస్ కావాలి. వివరాల్లోకి వెళితే..

జూలై 10న జారీ చేసిన CBSE సర్క్యులర్ ప్రకారం.. 2027-28 విద్యా సంవత్సరం నుంచి  సీబీఎస్ఈ పరీక్షా విధానంలో ఓ కీలక  మార్పును సూచిస్తుంది. థర్డ్ లాంగ్వేజ్ ఫెయిల్ అయితే 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతికి ప్రమోట్ అయినప్పటికీ పదో తరగతి పాస్ సర్టిఫికేట్ రావాలంటే, థర్డ్ లాంగ్వేజ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా పాస్ కావాలి. 

సీబీఎస్ ఈ విద్యార్థులు 6వ తరగతి నుంచి దశలవారీగా తప్పనిసరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది.  9వ ,10వ తరగతులలో కనీసం రెండు భాషా సబ్జెక్టులను తప్పనిసరిగా అభ్యసించాలి. మొదటి లాంగ్వేజ్ టీచింగ్ మీడియంగా పనిచేస్తుంది. అయితే భాష-2 ,భాష-3లను మాతృభాష ,విదేశీ భాషల జాబితా నుంచి ఎంపిక చేస్తారు. 

జాతీయ విద్యా విధానం (NEP) - 2020 ప్రకారం CBSE  9, 10 తరగతులకు త్రిభాషా విధానం తప్పనిసరి చేసింది. విద్యార్థులు మూడు భాషలను అభ్యసించాలి. వీటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. థర్డ్ లాంగ్వేజ్ గా ఏదైనా భారతీయ లేదా విదేశీ భాషను ఎంచుకునే అవకాశం ఉంది. CBSE 40కి పైగా భాషలను అందిస్తుంది. వీటినుంచే మొదటి, రెండవ లేదా మూడవ భాషలుగా కేటాయిస్తారు. ఇంగ్లీష మీడియం స్కూళ్లలో ఇంగ్లీషును,  ఇతర స్కూళ్లలో హిందీని మొదటి భాషగా విద్యార్థులు నేర్చుకుంటారు.  సెకండ్ లాంగ్వేజ్ గా  CBSE సెలబస్ లిస్టునుండి  మిగిలిన ఏ భాషనైనా ఎంచుకోవచ్చు.