ఖమ్మం: గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం

ఖమ్మం: గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాం

ఖమ్మం టౌన్, వెలుగు : యువత భవిష్యత్తును కాపాడేందుకు గంజాయి రవాణా, మాదకద్రవ్యాల విక్రయాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా గంజాయి రవాణా మార్గాలపై టాస్క్ ఫోర్స్,ఈగల్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఆరు నెలల్లోనే 55 కేసుల్లో రూ.2.24 కోట్ల విలువైన 450 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని 123 మంది అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 

గంజాయి రవాణా చేసే 20 మంది, విక్రయించిన 60 మంది, వినియోగించిన 70 మంది పై చట్టపరనైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గంజాయి రవాణాకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీపీ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు, డిజిటల్ ఫోరెన్సిక్స్, జాతీయ సైబర్ నేరాల నివేదన పోర్టల్, మనీ రిస్టోరేషన్ పోర్టల్, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం పోర్టల్, సమన్వయ పోర్టల్ వినియోగంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.