ఖమ్మం టౌన్, వెలుగు: ఓ మహిళ కిడ్నీలో పెరిగిన 800 గ్రాముల బరువున్న రాయిని డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్డు నెహ్రూ నగర్లో ఉన్న అపెక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కె. కిశోర్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన మైలవరపు విజ్జేశ్వరి పదేండ్లుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ నెల 10న నొప్పి తీవ్రం కావడంతో ఖమ్మంలోని అపెక్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయింది.
అన్ని రకాల టెస్ట్ లు చేసిన డాక్టర్లు మహిళ కిడ్నీలో ఓ రాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆపరేషన్ చేసి బయటకు తీశారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ ముకుందా బర్మా, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్.లలిత, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ దినేశ్ కుమార్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాకేశ్, ఆర్థోపెడిక్ డాక్టర్ శివ రాంరెడ్డి, పీఆర్ వో కె.శ్రీనివాసరావు ఉన్నారు.
