హైదరాబాద్ లో ఎక్మోతో యువ డాక్టర్ కు ప్రాణం

హైదరాబాద్ లో  ఎక్మోతో యువ డాక్టర్ కు ప్రాణం
  •    ఇన్‌‌‌‌ఫ్లుయెంజాతో పాడైన ఊపిరితిత్తులు  
  •     షోలాపూర్ నుంచి హైదరాబాద్‌‌‌‌కు తరలింపు
  •     కిమ్స్​లో 25 రోజుల ట్రీట్​మెంట్ 
  •     పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్

హైదరాబాద్ సిటీ, వెలుగు:  తీవ్రమైన ఇన్‌‌‌‌ఫ్లుయెంజా న్యుమోనియా కారణంగా శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్–ఏఆర్‌‌‌‌డీఎస్), ప్రాణాపాయ స్థితికి చేరుకున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌‌‌‌కు చెందిన 32 ఏండ్ల యువ డాక్టర్‌‌‌‌‌‌‌‌ను సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్స్ అత్యాధునిక ఎక్మో ట్రీట్ మెంట్ తో కాపాడారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో షోలాపూర్‌‌‌‌లోని స్థానిక దవాఖానలో చేరిన ఆమెకు సాధారణ వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ ఫలితం కనిపించలేదు.

ఈ క్రమంలో కిమ్స్ హాస్పిటల్స్‌‌‌‌కు చెందిన డా. వంశీకృష్ణ నేతృత్వంలోని ప్రత్యేక ఎక్మో బృందం షోలాపూర్‌‌‌‌ వెళ్లి అక్కడే ఎక్మో సపోర్ట్ ప్రారంభించింది. తర్వాత హైదరాబాద్‌‌‌‌లోని కిమ్స్ తరలించారు. ఇక్కడ డా. వంశీ కృష్ణ నేతృత్వంలో వారం పాటు ఎక్మో, వెంటిలేటర్ పై చికిత్స చేశారు. తర్వాత 18 రోజుల పాటు చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు.  డాక్టర్ ప్రతీక్ ఆధ్వర్యంలోని ఇన్‌‌‌‌ఫెక్షియస్ డిసీజెస్ విభాగం ఇందులో కీలకపాత్ర పోషించిందని కిమ్స్ హాస్పిటల్స్ లీడ్ కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ విశాల్ కుమార్ చిటికేశి తెలిపారు.