మోడల్ టీచర్లకు 010 పద్దు ద్వారా జీతాలివ్వాలి..సీఎస్ సంజయ్ జాజుకు టీఎంఎస్టీఏ వినతి 

మోడల్ టీచర్లకు 010 పద్దు ద్వారా జీతాలివ్వాలి..సీఎస్ సంజయ్ జాజుకు టీఎంఎస్టీఏ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సెక్రటేరియెట్‌‌లో సీఎస్  సంజయ్ జాజును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ఉపాధ్యక్షుడు కార్తీక్ తదితరులు కలిసి వినతిపత్రం అం దించారు.

ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మోడల్ స్కూల్ టీచర్లకు  కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్  సౌకర్యాన్ని కల్పించాలని, 010 పద్దు ద్వారా నేరుగా వేతనాలు చెల్లించే విధానా న్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌‌ను కలిసి వినతిపత్రం అందించారు. అలాగే, కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. చెన్నయ్య, రత్నాకర్ సీఎస్ కు వినతిపత్రం అందించారు.