రైల్వే ట్రాక్‌‌‌‌లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి : జీఎం సంజయ్ శ్రీవాస్తవ

రైల్వే ట్రాక్‌‌‌‌లపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి : జీఎం సంజయ్ శ్రీవాస్తవ
  • భద్రతా సమావేశంలో రైల్వే జీఎం సంజయ్​ శ్రీవాస్తవ

హైదరాబాద్​సిటీ, వెలుగు: రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి ట్రాక్‌‌‌‌ల నిర్వహణ, పర్యవేక్షణ అవసరమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. సోమవారం రైల్ నిలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రత్యేక భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సెక్షన్లు, ట్రాక్‌‌‌‌ల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సూపర్‌‌‌‌వైజర్లను ఆదేశించారు.

భద్రతా పనులు జరిగే ప్రాంతాల్లో ప్రమాణాలు పాటించడంతో పాటు, వివిధ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా, తనిఖీల సమయంలో గుర్తించిన ఎలాంటి లోపాలనైనా తక్షణమే సరిదిద్దాలని పునరుద్ఘాటించారు.