తెలుగులో ఈ మధ్య ఇలాంటి జానర్‌‌ సినిమా రాలేదు: నిర్మాత ఎస్.ఎస్ కార్తికేయ

తెలుగులో ఈ మధ్య ఇలాంటి జానర్‌‌ సినిమా రాలేదు: నిర్మాత ఎస్.ఎస్ కార్తికేయ

ఫ‌‌హాద్ ఫాజిల్ హీరోగా ఎస్‌‌.ఎస్‌‌.రాజ‌‌మౌళి సమ‌‌ర్పణ‌‌లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.  శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. సోమవారం టీజర్‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడియో బైట్ ద్వారా ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘తెలుగులో ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలని, మంచి  స్క్రిప్ట్ కోసం ఎప్పట్నుంచో  వెయిట్ చేస్తున్నా. 

ఇలాంటి  ఫ్యాంటసీ డ్రామా ఎలిమెంట్స్ ఉన్న సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నాడు. ఈ చిత్రంలో తాను పోషించిన దివ్య పాత్ర అందరికీ నచ్చుతుందని చైల్డ్ ఆర్టిస్ట్ సారా చెప్పింది. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌టైన్  చేస్తుందని  దర్శకుడు శశాంక్ యేలేటి చెప్పాడు. రాజమౌళి గారి స్టాంప్ పడ్డ తర్వాతే స్క్రిప్ట్ లాక్ అయిందని, ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌‌ సినిమా రాలేదని నిర్మాతలు ఎస్.ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ అన్నారు. ఇదొక మ్యాజికల్ వరల్డ్ అని మ్యూజిక్ డైరెక్టర్  కాల భైరవ అన్నాడు.