డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్

డీఈఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డైట్ కాలేజీల్లో డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ అయింది.  జులై 15న ఆయా కాలేజీలు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో ఖాళీల వివరాలను ప్రకటించనున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల కోసం జులై 16, 17వ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రోజు సాయంత్రం సీట్ల కేటాయింపు ఉంటుంది.

ప్రైవేట్ కాలేజీల్లో జులై 18 నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 21వ తేదీ సాయంత్రం సీట్లు కేటాయించనున్నారు. దీనికి డీఈఈసెట్–-2026లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులని, ఇప్పటికే ఏదైనా కాలేజీలో అడ్మిషన్ పొందిన వారు అనర్హులని కన్వీనర్ స్పష్టం చేశారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీటు పొందిన వారికి ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ వర్తించదన్నారు. పూర్తి వివరాల కోసం https://deecet.cdse.telangana.gov.in వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌ను చూడాలని సూచించారు.