ప్రేక్షకులకు సినిమా అనుభూతిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లోనే కాదు.. యావత్ ప్రపంచ సినీచరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి హైదరాబాద్ వేదిక కాబోతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రదర్శన సంస్థ ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) కాంబినేషన్‌లో ప్రపంచంలోనే అత్యంత భారీ సినిమా స్క్రీన్ నగరంలో రూపుదిద్దుకోబోతోందని సమాచారం.
హైదరాబాద్‌లోని ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (Financial District) పరిధిలో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ బిగ్ ప్రాజెక్ట్‌కు 'ఏషియన్ చిరంజీవి సినిమాస్' (ACC) లేదా 'ఏషియన్ మెగాస్టార్ సినిమాస్' (AMC) అని పేరు పెట్టే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ (IMAX) స్క్రీన్ జర్మనీలోని 'ట్రాంపలాస్ట్ లియోన్‌బర్గ్'లో ఉంది. దీని వెడల్పు127 అడుగులు, ఎత్తు 69 అడుగులు. అలాగే అమెరికాలోని పూలర్‌లో ఉన్న రాయల్ సినిమాస్ 101 అడుగుల వెడల్పు కలిగిన మరో భారీ స్క్రీన్. అయితే, ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్మించబోయే ఈ కొత్త థియేటర్ గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను సైతం దాటేసి రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
అత్యుత్తమ డ్యూయల్ లేజర్ టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ సౌండ్ సిస్టమ్స్, లగ్జరీ రీక్లైనర్స్‌తో ఈ బిగ్గెస్ట్ స్క్రీన్ రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ప్రసాద్స్ ఐమాక్స్ (Prasad's Large Screen) వంటి ఐకానిక్ స్క్రీన్‌కు కేరాఫ్‌గా ఉన్న హైదరాబాద్.. ఈ కొత్త మెగా ప్రాజెక్ట్‌తో గ్లోబల్ సినిమాలో మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Blessed to have Megastar Chiranjeevi Garu grace our Ganesh Visarjan Pooja at the Asian Cinemas office.
— Asian Cinemas (@AsianCinemas_) September 20, 2026
A truly memorable and divine moment!#asiancinemas #chiranjeevikonidela #boss #ganeshvisarjan pic.twitter.com/7Oa79Ix0EW
