ప్రియదర్శి , నాగదుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం టైటిల్ ఇటీవల పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇంకా షూటింగ్ కూడా మొదలవకముందే రిలీజ్ అప్‌డేట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్.
డిఫరెంట్ టైటిల్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషన్స్, హ్యూమర్, స్థానిక సంస్కృతిని చూపించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై దర్శకుడు సుకుమార్ భార్య తబిత, బన్నీ వాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
