ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్‌‌‌‌‌‌‌‌

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్‌‌‌‌‌‌‌‌

వంగూరు, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్‌‌‌‌‌‌‌‌ డిమాండ్ చేశారు. నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్​ ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. 

ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 15న హైదరాబాద్‌‌‌‌లోని ఇందిరా పార్క్ వద్ద సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాలో నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.