ప్రపంచ వ్యాప్తంగా వేగంగా మారుతున్న పరిణామాలు బులియన్ మార్కెట్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. దీంతో గోల్డ్ కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవటంతో రేట్లు దిగొస్తున్నాయి. అయితే తగ్గుతున్న రేట్లతో రిటైల్ షాపర్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఈ సమయంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించి ముందుకెళ్లటం బెటర్.
జూలై 14న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 13 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.11 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 280గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 090గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 14, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 35వేలకు చేరింది. అంటే గ్రాము దాదాపు రూ.235 దగ్గర ఉంది.
