సీఎం మహబూబ్‌‌‌‌నగర్ పర్యటనను సక్సెస్‌‌‌‌ చేయాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

సీఎం మహబూబ్‌‌‌‌నగర్ పర్యటనను సక్సెస్‌‌‌‌ చేయాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్/రూరల్‌‌‌‌, వెలుగు: ఈనెల 15న సీఎం మహబూబ్‌‌‌‌నగర్ పర్యటనను విజయవంతం చేయాలని విప్‌‌‌‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ సిటీలోని దివిటిపల్లి ఐటి పార్క్‌‌‌‌లో అమర రాజా గిగా కారిడార్ పరిధిలో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 

హెలీప్యాడ్‌‌‌‌, సభాస్థలి తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు, నాయకులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. సీఎం పర్యటన మహబూబ్ నగర్‌‌‌‌‌‌‌‌ను ఐటీ హబ్‌‌‌‌గా అభివృద్ధి చేసే దిశగా కీలక అడుగుగా నిలుస్తుందన్నారు. ఆయన వెంట లైబ్రరీ సంస్థ చైర్మన్‌‌‌‌ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అమరరాజా బ్యాటరీ యూనిట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కుష్బూ గుప్తా అధికారులతో కలిసి పరిశీలించారు.