నాగర్‌కర్నూల్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి లిఫ్ట్నార్లాపూర్లో ఒక పంప్‌ను నడిపించేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు. గత నెలలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన తర్వాత పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టులో పంపును నడిపించేందుకు రెండు రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్‌హౌజ్‌ల్లో నాలుగు చొప్పున పంపులు, మోటర్లు ఉన్నాయి.
గతంలోనే డ్రై రన్పూర్తి చేశారు. నార్లాపూర్పంప్‌హౌజ్‌లో మొదటి పంప్రన్చేసిన వారం తర్వాత రెండో పంప్‌కు ట్రయల్స్ నిర్వహిస్తామని ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. కాగా నార్లాపూర్‌లో మొదటి పంప్‌కు ట్రయల్‌రన్ నిర్వహించగా అది మొరాయించింది. 200 ఆర్‌పీఎంతో నడవాల్సిన పంప్170 వరకే వచ్చి నిలిచిపోతున్నట్లు సమాచారం.
