త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్‌గా కొండల్ రూపొందిస్తున్న చిత్రం ‘అదే నీవు అదే నేను’. శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'మనసా మనసా' అనే పాటను విడుదల చేశారు. సాంగ్ లాంచ్ చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
కనిష్క కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్‌ను జావెద్ అలీ పాడాడు. ‘‘ఎన్నెన్ని ఎన్నెన్ని వర్ణాలు ఉన్నా, నువు లేని వెలితేదో మిగిలున్నదే, ఇన్నాళ్లకైనా నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే. మారిందే వరసా, నీకైనా తెలుసా ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే, బంగారు సొగసా...” అంటూ పూర్ణాచారి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. వేద కొరియోగ్రఫీలోని క్యూట్ డ్యాన్స్ మూమెంట్స్, త్రినాథ్ వర్మ, తన్వీ నేగి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంప్రెస్ చేశాయి. త్వరలో సినిమా థియేటర్స్‌కు రాబోతోందని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
