నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కిష్టాపూర్, పట్ పటి తాండ గ్రామాలకు వెళ్లే రోడ్ల పై ఏడాదిన్నర క్రితం కంకర వేసి తారు వేయడం మరిచారు. దీంతో ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. రాత్రి వేళల్లో బైక్ లపై వెళ్లేవారు కంకర రోడ్డుపై పడి ప్రమాదాలకు గురవుతున్నారు.
నిధులు మంజూరైనా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కంకర వేసి పనులను మధ్యలోనే వదిలేశాడు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి రోడ్డును త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
