11 కేవీ లైన్ తగిలి యువకుడు మృతి.. రంగారెడ్డి జిల్లా బంజారుగడ్డ తండాలో ఘటన

11 కేవీ లైన్ తగిలి యువకుడు మృతి.. రంగారెడ్డి జిల్లా బంజారుగడ్డ తండాలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఇంటి పై ప్రమాదకరంగా ఉన్న 11 కేవీ విద్యుత్  లైన్‌‌‌‌కు తగిలి ఓ యువకుడు చనిపోయాడు. కందుకూర్  సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బంజారుగడ్డ తండాలో సోమవారం సాయంత్రం మేఘావత్ చరణ్(17) క్రికెట్​ ఆడుకుంటుండగా, బాల్​ పక్కనే ఉన్న ఇంటిపై పడింది. బాల్​ను తీసుకువచ్చేందుకు వెళ్లి, ఇంటిపై ఉన్న 11 కేవీ విద్యుత్  లైన్‌‌‌‌కు తాకడంతో అక్కడికక్కడే చనిపోయాడు. యువకుడి మృతికి ఇంటి ఓనర్​ రమేశ్, విద్యుత్  శాఖ ఏఈ వేణుగోపాల్ రెడ్డి, లైన్‌‌‌‌మన్  వాసు, గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్  నిర్లక్ష్యమే కారణమని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.