ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలంటూ ఓయూలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో మంగళవారం నిరుద్యోగ పోరు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్ధి సేన లీడర్లు మాట్లాడుతూ కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అమలుచేయకపోవడంతో నిరుద్యోగులు నిరాశలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీ, డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగులకు ఏజ్ రిలాక్సేషన్ఇవ్వాలని కోరారు. కాగా దీక్షకు పర్మిషన్ లేదంటూ విద్యార్థి సేన స్టేట్ప్రెసిడెంట్శివప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షను అడ్డుకునేందుకు అరెస్ట్‌లు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విద్యార్థి సేన లీడర్లు విమర్శించారు.
