బీపీ మెషీన్ ఎత్తుకెళ్లి ఇన్‌‌‌‌స్టాలో రీల్స్‌‌‌‌.. గాంధీ దవాఖాన భూత్ బంగ్లా అని కామెంట్ చేస్తూ పోస్ట్

బీపీ మెషీన్ ఎత్తుకెళ్లి ఇన్‌‌‌‌స్టాలో రీల్స్‌‌‌‌.. గాంధీ దవాఖాన భూత్ బంగ్లా అని కామెంట్ చేస్తూ పోస్ట్

పద్మారావునగర్, వెలుగు: బీపీ మెషీన్​ ఎత్తుకెళ్లి ఓ యువకుడు రీల్స్ చేసి ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పోస్ట్​ చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ప్రధాన భవనం మూడో అంతస్తు వార్డులో ఓ యువకుడు తన తాతను అడ్మిట్ చేశాడు. అక్కడ బీపీ చెక్ చేయలేదనే కోపంతో  డిజిటల్ బీపీ మెషిన్‌‌‌‌ దొంగిలించాడు. 

‘గాంధీ దవాఖాన ఒక భూత్ బంగ్లా’ అని  కామెంట్​ చేశాడు.  దీన్ని  ఇన్‌‌‌‌స్టాలో పోస్ట్‌‌‌‌ చేశాడు. దీంతో ఈ రీల్ వైరల్‌‌‌‌గా మారింది.  గాంధీ హాస్పిటల్ ​పాలకవర్గం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో  యువకుడి వివరాలు సేకరిస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.