- 1,900 గజాల్లో జీ ప్లస్ 2 నిర్మాణం, 280 గజాల్లో గ్యారేజీ తొలగింపు
హైదరాబాద్ సిటీ/ రామాంతాపూర్, వెలుగు: హైదరాబాద్‌లోని రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ఎఫ్టీఎల్ విస్తీర్ణం 30 ఎకరాలు కాగా.. ఇందులో16 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. దాదాపు 12 ఎకరాల్లో శాశ్వత కట్టడాలు వెలిశాయి. వీటి జోలికి వెళ్లకుండా మరో నాలుగెకరాల మేర తాత్కాలిక షెడ్లు, గుడిసెలు ఉండగా, వారికి డబుల్‌బెడ్ రూం ఇండ్ల మంజూరుకు హైడ్రా సిఫార్సు చేసింది. అలాగే, మంగళవారం 1,900 గజాల మేర జీ ప్లస్2 కమర్షియల్ నిర్మాణంతో పాటు 280 గజాల్లో ఉన్న ఆటో గ్యారేజీని తొలగించింది. దీంతో చెరువు ఎఫ్టీఎల్ విస్తరణ పనులకు ఆటంకాలు తొలిగాయి.
