కాగజ్ నగర్, వెలుగు: ప్రిన్సిపాల్, పీఈటీలు మాకోద్దు అంటూ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మహాత్మ జ్యోతి బాపులే( బాలుర) విద్యార్థులు రోడ్డెక్కారు. మంగళవారం సాయంత్రం స్కూల్ నుంచి బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ జయశ్రీ తమను పట్టించుకోవడంలేదని, స్కూల్లోని సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థులు ప్రశ్నిస్తే టీసీలు ఇచ్చి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటీ తమను కొడుతున్నాడని, అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న రూరల్ పోలీసులు వారిని సముదాయించారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ జయశ్రీని వివరణ కోరగా.. తాను బిజీగా ఉన్నానని, తర్వాత మాట్లాడతానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
