ఆర్టీసీ బస్సులో కండక్టర్ బ్యాగ్ కొట్టేసింది ఓ మహిళ... తన బ్యాగ్ పోయిందని గమనించిన కండక్టర్ బస్సు ఆపి చేస్క్ చేస్తుండగా.. మెల్లగా జారుకుందాం అనుకుంది కానీ.. దొరికిపోయింది. అక్కడితో ఆగకుండా డోర్ ఓపెన్ చేయాలంటూ డ్రైవర్, కండక్టర్ తో వాగ్వాదానికి దిగింది సదరు మహిళ. బెంగుళూరులో జరిగింది ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
KA-57 F 6331 నంబర్ గల బీఎంటీసీ బస్సు సిటీలో వెళ్తుండగా... కండక్టర్ టికెట్ బ్యాగ్ కనిపించకపోవడంతో బస్సును మధ్యలోనే నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.టికెట్ బ్యాగ్ దొరకకపోతే సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని టెన్షన్ పడ్డాడు కండక్టర్. ఇంతలో బస్సులోకి చేరుకున్న పోలీసులు ప్రయాణికుల బ్యాగులు, సామాన్లను పోలీసులు చెక్ చేయగా...టికెట్ బ్యాగ్ దొరికింది.
🚨 బీఎంటీసీ బస్సులో కలకలం.. కండక్టర్ టికెట్ బ్యాగ్ మాయం!
— ముచ్చట్లు (@muchatlu_) July 15, 2026
🔸 నగరంలోని బీఎంటీసీ బస్సు (KA-57 F 6331)లో కండక్టర్ టికెట్ బ్యాగ్ కనిపించకపోవడంతో బస్సును మధ్యలోనే నిలిపివేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
🔸 ప్రయాణికుల బ్యాగులు, సామాన్లను పోలీసులు తనిఖీ చేయగా టికెట్ బ్యాగ్ లభ్యమైంది.… pic.twitter.com/1FDA23U5sA
ఓ మహిళ బ్యాగ్ తీసుకున్నట్లు చూశామని పోలీసులకు చెప్పారు పలువురు ప్రయాణికులు. ఘటన సమయంలో ఆ మహిళ వీడియోను కూడా రికార్డు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ప్రయాణికుల వాంగ్మూలాలు, వీడియో ఫుటేజ్‌ను పరిశీలిస్తూ అసలు ఏం జరిగిందనే అంశంపై విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.
