తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( TWJF ) దశలవారి ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో బుధవారం ( జులై 15 ) సమాచార పౌరసంబంధాల శాఖ ( ఐ అండ్ పీఆర్ ) రాష్ట్ర శాఖ హెడ్డాఫీసు దగ్గర బహిరంగ నిరసన చేపట్టింది.
గతంలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వగా... రెండు రోజుల క్రితం కలెక్టరేట్ల దగ్గర నిరసన చేపట్టింది. అయినా సర్కారు నుంచి గానీ..అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవాళ నిరసనకు దిగినట్లు తెలిపారు TWJF సభ్యులు.
TWJF ప్రధాన డిమాండ్లు:
- కోటాలతో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
- ఇండ్లు లేదా ఇండ్లస్థలాలు ఇవ్వాలి. దీనికి సంబంధించిన ప్రక్రియ స్పీడప్ చేయాలి
- ఉద్యోగుల మాదిరిగానే జర్నలిస్టులకూ హెల్త్ కార్డులు ఇవ్వాలి
- ఆర్టీసీ, మెట్రో రైలులో పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
