హైదరాబాద్: SIRపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడానికి జూలై 24 చివరి రోజు అని, వచ్చే మూడు రోజుల్లో ఎన్యూమరేషన్ ఫామ్లు BLO లకు ఇవ్వండని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఫామ్ వచ్చిన వాళ్ళు వెంటనే ఫిల్ చేసి ఇవ్వండని, చివరి రోజు వరకు వెయిట్ చేయకండని ఆయన సూచించారు. ప్రతీ పోలింగ్ స్టేషన్ దగ్గర BLOలు కూర్చుంటున్నారని, ఇంకా మీకు ఎన్యూమరేషన్ ఫామ్ రాకపోతే మీ BLO లేదా BLAలకు కాల్ చేయండని ఆయన తెలిపారు.
హైద్రాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 47 లక్షల 36 వేల 669 మంది ఓటర్లున్నారని చెప్పారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్లు వంద శాతం డిస్ట్రిబ్యూట్ చేశామని తెలిపారు. 7.8 శాతం ఓటర్లు ఆన్ లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేశారని, ఇప్పటివరకు మొత్తం 25.5 శాతం ఎన్యూమరేషన్ ఫామ్ల వివరాలు డిజిటలైజ్ చేశామని వివరించారు. హైదరాబాద్ జిల్లాలో 24.33 శాతం ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించామని, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతీ వారం మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు గుర్తిస్తున్నామని, బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఎన్యూమరేషన్ ఫామ్లు కలెక్ట్ చేసుకుని ప్రతీరోజు 50 ఫామ్లు BLOలకు ఇవ్వొచ్చని ఆర్వీ కర్ణన్ సూచించారు.
ఆర్వీ కర్ణన్ ఇంకా ఏం చెప్పారంటే..
* SIRపై పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నాం
* ఎంటుమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాం
* ఏదైనా తప్పులు ఉంటే SIR అయిపోయాక ఫామ్ 8 ద్వారా చేంజ్ చేసుకోవచ్చు
* 31 జులైన డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తాం
* ఫామ్ ఇచ్చిన వారంతా డ్రాఫ్ట్ లిస్ట్లో ఉంటారు
* నోటీసులు వచ్చిన వారంతా 31 జూలై నుంచి 30 ఆగస్టు వరకు ERO వద్ద 11 ఐడీలో ఏదైనా ఒకటి ఇవ్వాలి
* బంజారాహిల్స్లో BLOలపై జరిగిన ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయించాం
* వారిపై కఠిన చర్యలు ఉంటాయి
* కంటోన్మెంట్లో 3 పోలింగ్ స్టేషన్లకు చెందిన 2002 ఓటర్ లిస్ట్ మిస్ అయింది
*వారిని స్పెషల్గా కన్సిడర్ చేసి ఫిల్ చేయిస్తాం
►ALSO READ | వచ్చే ఎన్నికల్లో మా టార్గెట్ 120... దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ స్వీప్ చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
