HPCLలో 358 ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

HPCLలో 358 ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేదు.. నిరుద్యోగులకు మంచి ఛాన్స్..

కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ పరిధిలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్) 2026–-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జులై 15 నుంచి జులై 31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ ట్రైనీ (ఇంజినీర్).

మొత్తం ఖాళీలు: 358. తెలంగాణ రాష్ట్రంలో 19 ఖాళీలు ఉన్నాయి.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి .

వయోపరిమితి: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 15.

లాస్ట్ డేట్: జులై 31. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు  hindustanpetroleum.comను సందర్శించండి.