హైదరాబాద్, వెలుగు: నెహ్రూ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు అడుగడుగునా ద్రోహం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో రచయిత సూర్యపల్లి శ్రీనివాస్ రచించిన ‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఓబీసీలకు చేసిందేమిటి?’ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందని విమర్శించారు. నెహ్రూ, రాజీవ్ గాంధీలు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని, మండల్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
