కాగజ్‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్‌లోని పెట్రోల్ బంక్ జెడ్పీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనం వండుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్అవడంతో ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న సీఐ ప్రేమ్‌కుమార్ వెంటనే బ్లూ కోల్ట్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి పంపారు. దాంతో పాటు ఫైర్ సిబ్బంది కి సమాచారం ఇవ్వగా వారు సైతం చేరుకొని మంటలను ఆర్పారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది.
