ఏం పోయే కాలం వచ్చిందో ఏంటో.. మనుషులు మరీ సైకోల్లా మారిపోయారు.. వాళ్లూ వీళ్లూ అని తేడా లేదు.. ఇంట్లో వాళ్లనే చంపుతున్నారు.. రోజుకో షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలో.. బెంగళూరులో వెలుగు చూసిన ఓ ఘటన అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఆ భార్యభర్తలు ఇద్దరూ డాక్టర్లు.. రాత్రి ఏం జరిగిందో ఏమో.. తన డాక్టర్ మొగుడిని కత్తితో పొడిచి చంపేసింది భార్య.. ఆ తర్వాత ఎనిమిదేళ్ల కొడుకును కత్తితో పొడిచేసింది. ఆ తర్వాత తీరిగ్గా.. ఇంట్లోనే భర్త శవం పక్కన పెట్టుకుని.. ఫోన్ చూసుకుంటూ ఉంది.. చుట్టుపక్కల వాళ్ల వచ్చి.. అక్కడ సీన్ చూసి అవాక్కయ్యారు. భార్య వ్యవహారం చూసి షాక్ అయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. కిరణ్ హోనన్నవర్, ప్రియాంక భార్యభర్తలు. వీరిద్దరూ డాక్టర్లే. కిరణ్ అనస్థీషియా స్పెషలిస్ట్ కాగా ప్రియాంక కంటి వైద్యురాలు. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఫ్యామిలీ మొత్తం కర్ణాటకలోని ధార్వాడ్‌లో నివాసం ఉంటుంది. అయితే, గత రెండు రోజులుగా కిరణ్‌ను సంప్రదించేందుకు అతడి బంధువులు కాల్ చేస్తున్నారు. కానీ అతడు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కిరణ్ ఫోన్‌ను అతడి భార్య లిఫ్ట్ చేసి.. కిరణ్ ఇంట్లో లేడని ఒకసారి.. పని మీద బయటకు వెళ్లాడని ఇంకొసారి పొంతన సమాధానాలు చెప్పింది.
దీంతో ప్రియాంక మీద అనుమానంతో బంధువులు నేరుగా కిరణ్ ప్లాట్‌కు వెళ్లి చూడగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. కిరణ్, అతడి కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండగా.. వారి పక్కనే ప్రియాంక ఏమి తెలియనట్లుగా ఫోన్ చూస్తూ కూర్చొంది. పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిరణ్, అతడి కుమారుడిని ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించగా.. కుమారుడు కొస ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రియాంకను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని.. విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతోందని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల వల్లే ప్రియాంక ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
