కేంద్రవిద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ దీక్షపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. క్షణిస్తున్నర వాంగ్ చుక్ ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన వైద్య సాయం ఏదైనా ప్రభుత్వమే చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ప్రాణం అమూల్యమైనది, ప్రభుత్వ డాక్టర్లు వాంగ్ చుక్ పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
వాంగు చుక్ దీక్ విరమించకపోతే రాబోయే 48 గంటల్లో అతను చనిపోతారని బుధవారం దాఖలైన పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ తర్పునిచ్చింది. ఈ పరిస్థితి పట్ల కేంద్ర ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని, కఠినంగా వ్యవహరిస్తోంది కూడా పిటిషన్‌లో ఆరోపించారు. వాంగు చుక్ కుబలవంతంగా ఆహారం అందించాలని ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు.
