చాందాలో అరుదైన పార్శ్వనాథ, జైన శిల్పాలు

చాందాలో అరుదైన పార్శ్వనాథ, జైన శిల్పాలు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్  జిల్లా చాందా గ్రామంలో వెయ్యేండ్ల కిందటి అరుదైన పార్శ్వనాథ శిల్పం, జైన శిల్పాలను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్​ శ్రీరామోజు హరగోపాల్  తెలిపారు. ఇందులో ప్రత్యేక ప్రతిమ లక్షణాలతో ఉన్న పార్శ్వనాథుని శిల్పాన్ని పరిశోధక బృందం సభ్యులు పృథ్వీరాజ్  రొడ్డావార్, సాయిరాజ్  కాంబ్లే, కత్తురి సుభాష్​​గుర్తించినట్లు చెప్పారు.

చాందా గ్రామంలో ఎన్నో విడి శిల్పాలు శిథిలావస్థలో కనిపిస్తున్నాయని, ఇది జైన ధర్మ కేంద్రమనడానికి నిదర్శనంగా శిల్పాలు ఉన్నాయన్నారు. శిల్ప శైలిని బట్టి పార్శ్వనాథుని శిల్పం 9వ శతాబ్దానికి చెందినదని, ఇలాంటి పోలికలతో భారత మ్యూజియం ఆర్కియాలజీ విభాగం బీహార్ లోని రాజగిర్, మహారాష్ట్రలోని తూర్పు ఖాందేశ్  ఎరందోల్ లో గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లభించని కుంథునాథ శిల్పాలు గుర్తించినట్లు తెలిపారు.