న్యూఢిల్లీ: అపోలో మైక్రో సిస్టమ్స్ అనుబంధ సంస్థ ఐడీఎల్ ఎక్స్‌ప్లోజివ్స్ రూ.55.22 కోట్ల విలువైన అదనపు ఆర్డర్లను దక్కించుకుంది. ఈ ఒప్పందాలు రాబోయే రెండేళ్లలో పూర్తవుతాయి. దీంతో అపోలో మైక్రో సిస్టమ్స్, దాని అనుబంధ సంస్థ సాధించిన మొత్తం ఆర్డర్ల విలువ రూ.189.56 కోట్లకు చేరింది.
41 ఏళ్ల చరిత్ర కలిగిన అపోలో మైక్రో సిస్టమ్స్‌కు రక్షణ సాంకేతిక రంగంలో అధునాతన ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్ వ్యవస్థల రూపకల్పన, తయారీలో నైపుణ్యం ఉంది. ఈ నెల ప్రారంభంలోనే ఈ సంస్థ ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో 41.33 శాతం ప్రమోటర్ వాటాను రూ.1,550 కోట్లకు కొన్నది. గత మూడు నెలల్లో అపోలో మైక్రోసిస్టమ్స్ షేరు 71.79 శాతం పెరిగింది.
