ఉప్పల్‎లో కార్స్24 కస్టమర్ హబ్ ప్రారంభం 

ఉప్పల్‎లో కార్స్24 కస్టమర్ హబ్ ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: ఆటోటెక్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ కార్స్24  హైదరాబాద్‌‌‌‌లోని ఉప్పల్ ప్రాంతంలో తన సరికొత్త కస్టమర్ హబ్‌‌‌‌ను ప్రారంభించింది. ఈ  కొత్త సదుపాయం ద్వారా నగరంలోని వాహన కొనుగోలుదారులు, విక్రేతలకు డిజిటల్‌‌‌‌తో పాటు నేరుగా సేవలు అందుబాటులోకి వస్తాయి. వాహనాల తనిఖీ, ఫైనాన్స్, యాజమాన్య బదిలీ ప్రక్రియలు ఇక్కడ సులభంగా చేసుకోవచ్చని కార్స్24 సీనియర్​ఎగ్జిక్యూటివ్​ విక్రమ్ చోప్రా తెలిపారు.

కస్టమర్లకు నమ్మకమైన, వేగవంతమైన సేవలు అందించడానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కార్ల వ్యాపారాన్ని మరింత విస్తరించడంలో భాగంగా కార్స్24 హైదరాబాద్​లో తన ఉనికిని బలోపేతం చేసుకుంటోందని విక్రమ్ ​వివరించారు.