ఆగస్ట్ 29న మార్కెట్‎లోకి ఎథర్ ఈఎల్ స్కూటర్.. ధర ఎంతంటే..?

ఆగస్ట్ 29న మార్కెట్‎లోకి ఎథర్ ఈఎల్ స్కూటర్.. ధర ఎంతంటే..?

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ సంస్థ ఎథర్​ఎనర్జీ ఈఎల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఆధారిత మొదటి మాస్ మార్కెట్ స్కూటర్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించనుంది. బెంగళూరులో వచ్చే నెల 29న జరిగే కమ్యూనిటీ డేలో దీనిని ప్రదర్శించనుంది. ఈ కొత్త స్కూటర్ ధర రూ.1.25 లక్షల లోపు ఉంటుంది. 

450 సిరీస్ తర్వాత ఎథర్​రూపొందించిన సరికొత్త వాహన నిర్మాణ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ ఇదే. ఈఎల్​ భవిష్యత్ ఉత్పత్తుల విస్తరణకు, తయారీ సామర్థ్యం పెంపునకు ఎంతగానో దోహదపడుతుంది. ఇదిలా ఉంటే, క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ ప్లేస్​మెంట్​ విధానంలో రూ.13,00 కోట్లు సేకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఒక్కోషేరును రూ.1,169కి అమ్మనుంది.