ఎంఈపీ సేవలపై నారెడ్కో సదస్సు

ఎంఈపీ సేవలపై నారెడ్కో సదస్సు

హైదరాబాద్, వెలుగు: భవన నిర్మాణ సదుపాయాల ప్రణాళిక, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ (ఎంఈపీ) సేవల గురించి వివరించడానికి నారెడ్కో తెలంగాణ, ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (ఐపీఏ) హైదరాబాద్ చాప్టర్ బుధవారం వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్ నిర్వహించాయి.  ఈ కార్యక్రమంలో డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పాల్గొన్నారు. 

ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే ఎంఈపీ ప్రణాళికలు రూపొందించుకోవడం వల్ల భవిష్యత్తులో అనవసర ఖర్చులు తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు.  నీటి సరఫరా, పంపింగ్ వ్యవస్థల సమర్థవంతమైన నిర్వహణ భవనాల భద్రతకు ఎంతో అవసరమని వివరించారు. పెద్ద ప్రాజెక్టులలో వాటర్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ప్రాధాన్యం గురించి వివరించారు. నగరాల వృద్ధికి అనుగుణంగా నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగిందని నారెడ్కో తెలిపింది.