కామధేను కలర్ మ్యాక్స్ షీట్ల ఉత్పత్తి భారీగా పెంపు

కామధేను కలర్ మ్యాక్స్ షీట్ల ఉత్పత్తి భారీగా పెంపు

హైదరాబాద్, వెలుగు: టీఎంటీ బార్ల తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ తెలుగు రాష్ట్రాల్లో తన కామధేను కలర్ మ్యాక్స్ షీట్ల మార్కెట్ వాటాను పెంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని 25 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది.  

ఉత్పత్తిని 4,800 మెట్రిక్ టన్నుల నుండి 6,000 మెట్రిక్ టన్నులకు విస్తరించనుంది. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా 20 శాతం పెంచాలని సంస్థ భావిస్తోంది. భవనాల నిర్మాణానికి అనువైన ఈ కలర్ కోటెడ్ స్టీల్ షీట్లు తుప్పు పట్టకుండా, తీవ్ర వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో తయారవుతాయని కామధేను తెలిపింది.