FAUZI Release Date: అఫీషియల్.. ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

FAUZI Release Date: అఫీషియల్.. ప్రభాస్ ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘రాజా సాబ్’ చిత్రంతో సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఏడాది చివర్లో మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వరుస ప్రాజెక్టుల్లో నటిస్తుండగా, వాటిలో హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ ముందుగా రానుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఫౌజీ’ (Fauzi) రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం కొత్త పోస్టర్ పంచుకుంది.  

‘‘అజ్ఞాతపర్వం ముగిసింది.. ఇప్పుడు తిరుగుబాటు ప్రారంభం! ‘ఫౌజీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది’’ అని మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ సినీ ఫ్యాన్స్లో అంచనాలు పెంచింది. పోస్టర్‌లో ప్రభాస్ వీరోచితమైన లుక్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ముఖ్యంగా ఈ పోస్టర్ ద్వారా ‘ఫౌజీ’లో ఉండే కీలక ఎపిసోడ్ని రివీల్ చేసిన తీరు ప్రభాస్ ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తోంది. ఇకపోతే, ఆగస్టు 15 (ఇండిపెండెన్స్ డే) సందర్భంగా ‘ఫౌజీ’ గ్లింప్స్ రిలీజ్ కానుందని టాక్. 

1940 బ్యాక్‌‌డ్రాప్‌‌ దేశభక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలోని సైనికుడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. దేశభక్తి, ప్రేమ, త్యాగం, స్వాతంత్ర్యం కోసం ఆ సైనికుడి ప్రయాణం ఎలా సాగిందనే కథాంశంతో ఈ సినిమా ఉండనుంది. సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లూయెన్సర్ ఇమాన్వి హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ  చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.