టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ జులై 26.
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీతోపాటు ఫైనాన్స్ లేదా అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. కామర్స్‌లో పీజీ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తిచేసి, ఫైనాన్స్ లేదా అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం మూడేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జులై 8.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు రూ.250 చెల్లించాలి.
లాస్ట్ డేట్: జులై 26.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ tiss.ac.inను సందర్శించండి.
