వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి Send Later ఫీచర్ !

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి Send Later ఫీచర్ !

ఆండ్రాయిడ్‌ స్మార్ట్ ఫోన్లలో మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకునేందుకు వీలు కల్పించే ఫీచర్‌ తీసుకొచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఈ Send Later ఫీచర్ను కొద్దిమంది బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నారు.

ఈ ఫీచర్తో యూజర్లు టెక్స్ట్ మెసేజ్‌లు, లింక్‌లు, ఫోటోలు, వీడియోలను ముందుగానే సిద్ధం చేసుకుని.. తాము కోరుకున్న సమయంలో ఆటోమేటిక్‌గా పంపేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వన్-ఆన్-వన్, గ్రూప్ చాట్‌లు రెండింటికీ పనిచేస్తుందని, పంపేవారి ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ షెడ్యూల్ చేసిన మెసేజ్‌లను పంపవచ్చని వాట్సాప్ చెబుతోంది.

అంతేకాకుండా.. మెసేజ్‌లు పంపే ముందు యూజర్లు వాటిని షెడ్యూల్ నుంచి రివ్యూ చేసుకోవచ్చు లేదా అవసరం లేదనుకుంటే తొలగించవచ్చు. ఈ ఫీచర్‌లో వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. షెడ్యూల్ చేసిన సందేశాన్ని తొలగించినప్పుడు, ఎవరికి పంపాలని అనుకున్నామో వారికి ఇలా మనం డిలీట్ చేశామని ఎటువంటి నోటిఫికేషన్ వెళ్లదు. సో.. కంగారు పడాల్సిన పనిలేదు. 

ప్రస్తుతానికి ఈ ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ టెక్స్ట్, వెబ్‌సైట్ లింకులు, ఫొటోలు, వీడియోలు.. ఇలా ఏ కంటెంట్ అయినా షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంది.