ఇండియా వెస్టిండీస్ మధ్య టీ20 మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం ( అక్టోబర్ 13 ) ఉప్పల్ వేదికగా జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్ కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే.. ఈ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ టికెట్ల దందాకు తెర లేపారు కొందరు కేటుగాళ్లు. HCA సభ్యుడి ద్వారా టికెట్లు పొంది టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు గోషామహల్ పోలీసులు.
నిందితుల నుంచి నాట్ ఫర్ సేల్’ అని ముద్రించిన 11 కాంప్లిమెంటరీ టికెట్లు, 8 పాసులు, రూ.5 వేల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఒక సుజుకి యాక్సెస్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రచారం చేసినట్లువెల్లడించారు పోలీసులు.
►ALSO READ | IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి యువరాజ్ సింగ్.. బ్యాటింగ్ కోచ్‌గా కీలక బాధ్యతలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడి ద్వారా టికెట్లు పొందినట్లు విచారణలో గుర్తించామని తెలిపారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న నిందితులు అక్షరిత్ శ్రీవాస్తవ, అవినాష్ దారక్, మోహిత్ సోమాని, సతీష్ చంద్ర శ్రీవాస్తవలను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
