Drishyam 3 Box Office Collection : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దృశ్యం 3'.. రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో అజయ్ దేవగణ్!

Drishyam 3 Box Office Collection : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'దృశ్యం 3'.. రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో అజయ్ దేవగణ్!

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3: ది కన్‌క్లూజన్' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఉత్కంఠభరితమైన కథనం, ఊహించని మలుపులు, విజయ్ సల్గావ్కర్ పాత్రలో అజయ్ దేవగణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువైంది. దీంతో అజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

తగ్గని జోరు...

విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా ఇండియాలో రూ.245.50 కోట్ల వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలోనూ మంచి వసూళ్లను నమోదు చేసినప్పటికీ, సోమవారం కలెక్షన్లు ఒక్కసారిగా తగ్గాయి. ఆ రోజు ఇండియాలో రూ.6.25 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో దేశీయ నెట్ కలెక్షన్లు రూ.315.25 కోట్లకు చేరగా, ఇండియా గ్రాస్ రూ.378.24 కోట్లకు పెరిగింది. ఓవర్సీస్‌లో రూ.111.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.489.74 కోట్లకు చేరుకుంది.

అజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్!

గతంలో 'సింగం అగైన్', 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్'చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న అజయ్ దేవగణ్.. ఇప్పుడు 'దృశ్యం 3'తో తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాను అందుకున్నారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టబు, శ్రియ శరణ్, జైదీప్ అహ్లావత్, రాజత్ కపూర్, ఇషితా దత్తా, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

►ALSO READ | Ranabaali Censor Report: 'రణబాలి' సెన్సార్ రిపోర్ట్‌లో క్రేజీ ట్విస్ట్.. ఒక్క కట్ లేకుండా విజయ్-రష్మిక మూవీకి U/A సర్టిఫికెట్!

మోహన్‌లాల్ ప్రశంసలు..

మలయాళ 'దృశ్యం' స్టార్ మోహన్‌లాల్ సైతం హిందీ వెర్షన్‌పై ప్రశంసలు కురిపించారు. "విజయ్ సాల్గావ్కర్ ప్రయాణానికి ఇచ్చిన ముగింపు అద్భుతం"అంటూ ఆయన అజయ్ టీమ్‌ను అభినందించగా, అజయ్ దేవగణ్ కృతజ్ఞతలు తెలిపారు.  టబు, శ్రియ, జైదీప్ అహ్లావత్, ప్రకాష్ రాజ్ వంటి హ్యుజి కాస్టింగ్ నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్, ఎండింగ్ ట్విస్టులతో ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.  అక్టోబర్ 2న విడుదలైన ఈ థ్రిల్లర్.. రూ.500 కోట్ల మార్కును అందుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..