విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ అప్డేట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. ప్రచార చిత్రాల్లోనే తీవ్ర హింసతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఒక్క కట్ కూడా సూచించకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది.. దీంతో అసలు సినిమాలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయనే చర్చ మొదలైంది.
ఒక్క కట్ కూడా లేదా.. ?
రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రణబాలి' బ్రిటిష్ పాలన కాలం నాటి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా. 1870ల దక్షిణ భారతదేశంలో కరువు, బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాల నేపథ్యంలో తన ప్రాంత ప్రజల కోసం పోరాడే ఓ యోధుడి కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ఇందులో రణబాలిగా కనిపించనుండగా, రష్మిక జయమ్మ పాత్రలో నటిస్తోంది. బ్రిటిష్ అధికారిగా ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రచార వీడియోల్లో కనిపించిన హింసాత్మక దృశ్యాల నేపథ్యంలో ఈ సినిమాకు ఎలాంటి సెన్సార్ మార్పులు సూచిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి కత్తిరింపులు లేకుండానే U/A సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక వివరాలు రావాల్సి ఉంది.
రన్‌టైమ్ ఎంతంటే?..
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టీ-సిరీస్ సమర్పకులుగా వ్యవహరిస్తోంది. అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. సుమారు 2 గంటల 50 నిమిషాల రన్‌టైమ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విజయ్–రష్మిక జంటకు మూడో కలయికగా వస్తోంది. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత వీరి కెమిస్ట్రీని మరోసారి వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
►ALSO READ | Jim Jim Thara Full Song : జిమ్ జిమ్ తార జిలేబీ తేరా చిన్నోడా! 'పర్ణశాల' నుంచి ఫుల్ సాంగ్ వచ్చేసింది!
కట్లు లేవన్న వార్త నిజమైతే, కథలోని తీవ్రతను యథాతథంగా చూపించేందుకు చిత్రబృందానికి అవకాశం లభించినట్లే. అయితే అసలు సెన్సార్ వివరాలు, రన్‌టైమ్‌పై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ సమాచారాన్ని నివేదికలుగానే చూడాలి. ‘రణబాలి’లో విజయ్ ఎలాంటి విధ్వంసం సృష్టించనున్నాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే...
