మమతా బెనర్జీపై హత్యాయత్నం.. అత్త అంటూ వచ్చి కత్తితో..!

మమతా బెనర్జీపై హత్యాయత్నం.. అత్త అంటూ వచ్చి కత్తితో..!

కోల్‎కతా: టీసీఎం అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై హత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని ఓ మహిళా కత్తితో మమతా బెనర్జీపై దాడికి యత్నించినట్లు టీఎంసీ ఆరోపించింది. వెంటనే అప్రమత్తమైన టీఎంసీ కార్యకర్తలు సదరు మహిళను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో దీదీకి పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో మమతా బెనర్జీ భద్రతపై టీఎంసీ ఆందోళన వ్యక్తం చేసింది.

టీఎంసీ వర్గాల ప్రకారం.. మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి దుర్గా పూజా పండాల్‌ను ప్రారంభించేందుకు కోల్‌కతాలోని కాళీఘాట్‌లో తన నివాసం నుంచి దీదీకి బయటకు వచ్చారు. ఈ క్రమంలో జనసమూహం నుంచి ఓ మహిళా మమతా బెనర్జీ వైపు దూసుకొచ్చి కత్తితో దాడికి యత్నించారు. 

దీదీ చీరను లాగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. టీఎంసీ పార్టీ కార్యకర్తలు వెంటనే ఆ మహిళను పట్టుకుని అనంతరం కాళీఘాట్ పోలీసులకు అప్పగించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడికి యత్నించిన మహిళ మత్తుపదార్థాల ప్రభావంలో ఉందని, ఆమె చేతిలో కత్తి ఉందని రాజ్యసభ ఎంపీ డోలా సేన్ చెప్పినట్లు సమాచారం. 

►ALSO READ | ఫ్లైదుబాయ్ ఘటనలో బిగ్ ట్విస్ట్.. యూఏఈలో ఇద్దరు మాల్దీవియన్ పైలట్లు అరెస్ట్

ఆమె మమతా బెనర్జీ మేనకోడలినని చెప్పుకుంటూ జనసమూహంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో మాజీ సీఎం మమతా బెనర్జీ భద్రతా ఏర్పాట్లపై బీజేపీ ప్రభుత్వాన్ని టీఎంసీ ప్రశ్నించింది. మమతా బెనర్జీకి ప్రాణహాని ఉందని.. ఆమెకు ఏమైనా జరిగితే బీజేపీదే బాధ్యత అని టీఎంసీ పేర్కొంది. మమతా బెనర్జీపై దాడికి యత్నం జరగడం బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.