హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతిపాదించిన "ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో" ఏర్పాటుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. బ్యూరో ఏర్పాటు, విధులు, సిబ్బంది, చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాలు, పరిపాలనా విధానాలపై తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ మీటింగులో డీజీ (ఆర్గనైజేషన్) స్వాతిలక్రా, రోడ్ సేఫ్టీ ఐజీ రమేశ్ నాయుడు పాల్గొన్నారు. వీరితో పాటు హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ సీపీలు జోయల్ డెవిస్, సన్‌ప్రీత్ సింగ్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ప్రస్తుత ట్రాఫిక్ పరిస్థితులు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఇతర రాష్ట్రాల్లో రోడ్డు భద్రత కోసం అమలవుతున్న విధానాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై విస్తృతంగా చర్చించారు.
