చిన్నారిపై బ్లేడుతో దాడి.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో ఘటన

చిన్నారిపై బ్లేడుతో దాడి.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో ఘటన

బీర్కూర్, వెలుగు : ఏడు నెలల చిన్నారిపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్ తో గాయాలు చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో బుధవారం వెలుగు చూసింది. బీర్కూర్ ఇందిరా కాలనీకి చెందిన టేకు సతీశ్, సంధ్యకు ఏడు నెలల కుమార్తె ఉంది. మంగళవారం రాత్రి చిన్నారి తండ్రి సతీశ్ పక్కన పడుకుంది. కొద్ది సేపటి తర్వాత సతీశ్​నిద్ర లేచి చూడగా పాప కనిపించకపోవడంతో భార్య వద్ద పడుకొని ఉంటుందని భావించి నిద్రపోయాడు. తెల్లవారుజామున చిన్నారి గురించి అడుగగా తనకు తెలియని సంధ్య సమాధానమిచ్చింది. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించగా.. గోసంగి సంఘం బిల్డింగ్​వెనుక ఒళ్లంతా గాయాలతో పడి కనిపించింది. వెంటనే బాన్సువాడ ఏరియా హాస్పిటల్​కు, అక్కడి నుంచి నిజామాబాద్​ హాస్పిటల్ కు తరలించారు.