నిజామాబాద్, వెలుగు: యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు నిజామాబాద్ బియ్యం ఎగుమతులు ప్రారంభమయ్యాయి. 24.1 మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్వ్యాన్ను జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం జెండా ఊపి పంపించారు.
భారత్, యూకే మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఎగుమతులకు అవకాశం లభించిందని, సోనామసూరి రైస్‌ను గజానన్ రైస్‌మిల్లు నుంచి విశాఖ పోర్టుకు పంపించినట్లు కలెక్టర్ తెలిపారు. సముద్ర మార్గం గుండా బియ్యం యూకేకు చేరనున్నట్లు చెప్పారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ వీరాస్వామి, హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
