నెక్కొండ: సర్పంచ్పై డీపీవోకు ఫిర్యాదు

నెక్కొండ: సర్పంచ్పై డీపీవోకు ఫిర్యాదు

నెక్కొండ, వెలుగు: వరంగల్​జిల్లా నెక్కొండ మండలంలోని తోపనపల్లికి సర్పంచ్​ చాగంటి మమత అవినీతికి పాల్పడుతుందంటూ ఉపసర్పంచ్ నీలకంఠం వెంకన్నతో పాటు వార్డు సభ్యులు బుధవారం డీపీవోకు కల్పనకు ఫిర్యాదు చేశారు. ప్రతి నెల రెగ్యులర్​గా సిబ్బందికి జీతాలు చెల్లించాలని జీపీలో తీర్మానం చేసినా, ఆరునెలలుగా జీపీ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదన్నారు. 

వ్యతిరేకంగా ఉన్న సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టిన పనులు నాణ్యత లేకుండా చేశారని వాటిపై ఎంక్వైరీ చేయాలని కోరారు..