హసన్ పర్తి, వెలుగు : తెలంగాణ ట్రాన్స్‌కో, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంస్థల ఆధ్వర్యంలో ఇంటర్ సర్కిల్ క్రీడా పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్ పోటీలు నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఆపరేషన్) బి. సామ్య నాయక్ తెలిపారు.
గురువారం ప్రారంభమయ్యే ఈ పోటీలు ఈ నెల 18 వరకు కొనసాగుతాయని చెప్పారు. ఉదయం 9 గంటలకు జరగనున్న ప్రారంభ పోటీలకు టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 18న మధ్యాహ్నం 12 గంటలకు ట్రోఫీలు, బహుమతులు అందజేతతో పోటీలు ముగియనున్నట్లు వెల్లడించారు.
