జయశంకర్ భూపాలపల్లి: ఎక్కువ రేటుకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్

జయశంకర్ భూపాలపల్లి: ఎక్కువ రేటుకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: జిల్లాలో రైతులకు కావాల్సిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. మంగళవారం జిల్లాలోని గణపురం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. స్టాక్ బోర్డును పరిశీలించి రైతులతో మాట్లాడారు. 

యూరియా సరఫరా, బూకింగ్​సమస్యలపై ఆరా తీశారు. అడిషనల్​ కలెక్టర్ విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి బాబూరావు, పశు సంవర్థక శాఖ డీడీ డా కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.